Harmanpreet Kaur: టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం.. ఐసీసీ ‍ప్రకటన

by Vinod kumar |
Harmanpreet Kaur: టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం.. ఐసీసీ ‍ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆమెపై రెండు మ్యాచ్‌ల నిషేధం విధిస్తున్నట్లు ఐసీసీ తాజాగా ప్రకటించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం వెల్లడించింది. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో దురుసు ప్రవర్తన కారణంగా ఐసీసీ హర్మన్‌కు 4 డీ మెరిట్‌ పాయింట్లు కేటాయించిన విషయం తెలిసిందే.

బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన చివరి పోరులో హర్మన్‌.. అంపైరింగ్‌ తీరును తప్పుపట్టింది. వికెట్లను బ్యాట్‌తో కొట్టడంతో పాటు.. మ్యాచ్‌ అనంతరం కూడా దీనిపై వ్యాఖ్యలు చేసింది. బహుమతి ప్రదానోత్సవంలో బంగ్లా కెప్టెన్‌తోనూ హర్మన్‌ దురుసుగా ప్రవర్తించింది. మ్యాచ్ ముగిశాక ప్రజెంటేషన్ సెర్మనీలో అంపైర్లపై చేసిన వ్యాఖ్యలు, ట్రోఫీ అందుకునేప్పుడు బంగ్లా ఆటగాళ్లపై వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది.

Advertisement

Next Story

Most Viewed