త్యాగాలను స్మరించుకోవాలి : వనపర్తి కలెక్టర్

by Aamani |
త్యాగాలను స్మరించుకోవాలి : వనపర్తి కలెక్టర్
X

దిశ,వనపర్తి : విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసుల త్యాగలను స్మరించుకో వలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయం జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీసుల సంస్మరణ దినోత్సవం ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హాజరయ్యారు.జిల్లా ఎస్పీ గిరిధర్,అదనపు ఎస్పీ రాందాస్ లతో కలిసి అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి,రెండు నిమిషాలు మౌనం పాటించారు.తెలంగాణలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 214 మంది పోలీసు అధికారులను,సిబ్బంది సేవలను గుర్తు చేసుకున్నారు.వనపర్తి జిల్లా లో విధి నిర్వహణ లో మరణించిన నాలుగు పోలీసు కుటుంబ సభ్యులను పరామర్శించి,జ్ఞాపికలను అందజేశారు.ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు,ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Next Story