Chamala: అందరూ మీ నాన్నలా గొప్ప ఇంజినీర్‌లా ఉండలేరు కేటీఆర్.. కాంగ్రెస్ ఎంపీ కౌంటర్

by Ramesh Goud |
Chamala: అందరూ మీ నాన్నలా గొప్ప ఇంజినీర్‌లా ఉండలేరు కేటీఆర్.. కాంగ్రెస్ ఎంపీ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేటీర్ అందరూ మీ నాన్నలా గొప్ప ఇంజనీర్‌లా ఉండరని, అడ్డగోలుగా మాట్లడితే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.కాంగ్రెస్ నేతల సియోల్ టూర్ పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్ పై స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. దీనిపై చామల.. లక్షకోట్ల కాళేశ్వరం డిజైన్ రూపకర్త, దేశంలోనే గొప్ప ఇంజనీర్ అయిన నీ అయ్య లెక్క అందరూ ఉండరు కేటీఆర్ అని విమర్శలు చేశారు. అలాగే ఇంట్లో కూర్చునే లక్షకోట్లతో కాళేశ్వరం డిజైన్ చేసి, 50 వేల కోట్లు కమీషన్ల రూపంలో మింగేసిన మీలా ఉండరు కదా అని ఎద్దేవా చేశారు.

మాది ప్రజా ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు మేము జవాబుదారీ అని చెప్పారు. అంతేగాక నీ ఘడీల పాలనలో అడిగేవారు లేరని అందినకాడికి దోచుకుతిన్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అడ్డగోలుగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు గుడ్డలూడదీసి కర్రుతో వాత పెడతరు జర భద్రం అని కేటీఆర్ ను ఎంపీ హెచ్చరించారు. కాగా కేటీఆర్ కాంగ్రెస్ నేతల సియోల్ టూర్ పై.. సియోల్ లో రివర్ ఫ్రంట్ అభివృద్దిని అంచనా వేయడానికి బృందాన్ని పంపినందుకు అభినందనలు అంటూ.. వారు అద్భుతమైన ఫలితాలతో తిరిగి వస్తారని, 1.5 లక్షల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేయడాన్ని సమర్థిస్తారని నేను భావిస్తున్నానని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed