నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి : మానకొండూరు ఎమ్మెల్యే

by Aamani |
నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి : మానకొండూరు ఎమ్మెల్యే
X

దిశ, గన్నేరువరం: రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. సోమవారం మండలంలోని గుండ్లపల్లి, గునుకుల కొండాపూర్ గ్రామాలలో ఐకేపీ, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తాలు లేకుండా సరైన తేమ శాతం ఉండేలా కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. నాణ్యమైన ధాన్యం తీసుకువస్తే ఏ విధమైన అదనపు తూకం వేయడం, కోతలు విధించడం ఉండదని, గత ప్రభుత్వంలో కొనుగోలు కేంద్రాలలో రైతులు అనేక ఇబ్బందులకు గురయ్యారని ప్రజాపాలనలో రైతుల సంక్షేమం పూర్తి స్థాయిలో ఉంటుందని హామీ ఇచ్చారు.

సన్న వడ్లకు రూ.500 బోనస్ ప్రభుత్వం అందిస్తుందని,రైతులు కొనుగోలు కేంద్రాలలో ధాన్యం అమ్ముకోవాలని దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఇప్ప నరేందర్, ఎంపీడీవో శ్రీనివాస్, ఏవో కిరణ్ మై, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొమ్మెర రవీందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముసుకు ఉపేందర్ రెడ్డి, జిల్లా కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ అల్వాల కోటి, మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, మాజీ ఎంపీపీ ఒగ్గు దామోదర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సతీష్ రెడ్డి, నేలపట్ల కనకయ్య, మాతంగి అనిల్, గ్రామ శాఖ అధ్యక్షుడు నాగపురి శంకర్ గౌడ్ ,నాయకులు బేతల్లి రాజేందర్ రెడ్డి, వంగల సత్యనారాయణ రెడ్డి, సుదగోని మల్లేశం గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, హనుమండ్ల నరసయ్య, తాళ్లపల్లి రవి గౌడ్, లింగంపల్లి హరీష్ , నేలపట్ల రాజు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed