స్మిత్ నాటౌటే.. బెన్‌స్టోక్స్ పట్టిన క్యాచ్‌పై ఐసీసీ క్లారిటీ

by Vinod kumar |
స్మిత్ నాటౌటే.. బెన్‌స్టోక్స్ పట్టిన క్యాచ్‌పై ఐసీసీ క్లారిటీ
X

లండన్ : యాషెస్ సిరీస్‌లో ఆఖరిదైన ఐదు టెస్టును ఇంగ్లాండ్ దక్కించుకుని సిరీస్‌ను 2-2తో సమం చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో చివరి రోజైన సోమవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మెయిన్ అలీ వేసిన 66వ ఓవర్‌లో తొలి బంతి ఆసిస్ బ్యాటర్ స్మిత్ గ్లవ్‌కు టచ్ అయి ప్యాడ్లను తాకి గాల్లోకి లేవగా స్టోక్స్ ఎగిరి మరి అద్భుతంగా పట్టుకున్నాడు. అయితే, సంబరాలు చేసుకునే క్రమంలో బంతి పట్టుకున్న క్షణ కాలంలోనే బాల్ చేజారింది.

దాంతో అంపైర్ ఎలాంటి సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఇంగ్లాండ్ డీఆర్ఎస్ తీసుకుంది. సమీక్షించిన థర్డ్‌ అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించాడు. సోషల్ మీడియాలో అది అవుటా? నాటౌటా? అనే విషయంపై చర్చ జరిగింది. దీనిపై ఐసీసీ స్పష్టతనిచ్చింది. స్మిత్ నాటౌటే అని వెల్లడించింది. ఎంసీసీ నిబంధన 33.3 ప్రకారం క్యాచ్ స్పష్టం లేదని, బంతి అందుకున్నా దానిపై పూర్తి నియంత్రణ లేదని ఐసీసీ తెలిపింది. బంతి అందుకున్నప్పటి నుంచి చివరి వరకు పూర్తి నియంత్రణ ఉంటనే దానిని సరైన క్యాచ్‌గా పరిగణిస్తామని పేర్కొంది.

Advertisement

Next Story