జైశ్వాల్‌లో నాకు అతను కనిపించాడు.. యువ ఓపెనర్‌పై అశ్విన్ ప్రశంసలు

by Swamyn |   ( Updated:2024-01-25 14:31:56.0  )
జైశ్వాల్‌లో నాకు అతను కనిపించాడు.. యువ ఓపెనర్‌పై అశ్విన్ ప్రశంసలు
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌ దూకుడు ఆటతీరుపై సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించాడు.భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా వచ్చిన జైశ్వాల్ 70 బంతుల్లో 76 పరుగులు చేశాడు. తొలి రోజు ఆట ముగిసిన తర్వాత అశ్విన్ మాట్లాడుతూ.. జైశ్వాల్ చక్కని షాట్లు ఆడాడని కొనియాడాడు. అతని బ్యాటింగ్ చూస్తుంటే టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను చూసినట్టు అనిపించిందని కితాబిచ్చాడు. ‘జైశ్వాల్ కొన్ని షాట్లు ఆడేటప్పుడు ఫుట్‌ వర్క్‌లో తప్పులు లేవు. అతని ఆటను చూస్తూ ఎంజాయ్ చేశా. కొన్నిసార్లు అతని బ్యాటింగ్‌లో నాకు రిషబ్ పంత్ కనిపించాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లను పంత్, జైశ్వాల్ కలిసి ఎదుర్కోవడం నేను చూడాలనుకుంటున్నా.’ అని అశ్విన్ తెలిపాడు. కాగా, తొలి మ్యాచ్‌లో అశ్విన్ సైతం ఆకట్టుకున్నాడు. 3 వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

Read More..

కింగ్ కోహ్లీ చరిత్ర.. తొలి ఆటగాడిగా సరికొత్త రికార్డు

Advertisement

Next Story