‘జాట్’ ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.. ఆకట్టుకుంటున్న ప్రీ ట్రైలర్ వీడియో

by Kavitha |   ( Updated:2025-03-24 12:23:18.0  )
‘జాట్’ ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.. ఆకట్టుకుంటున్న ప్రీ ట్రైలర్ వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichand Malineni), బాలీవుడ్ సూపర్ స్టార్ సన్నీ డియోల్(Sunny Deol) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘జాట్’(JAAT). పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్‌డ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని(Naveen Yerneni), వై రవిశంకర్(Ravi Shankar) నిర్మిస్తున్నారు. అయితే పలు హిట్ మూవీస్ తెరకెక్కించిన దర్శకుడు రూపొందిస్తుండటంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఈ చిత్రానికి ఎస్ తమన్(Thaman) బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా.. ఇందులో వినీత్ కుమార్ సింగ్(Vineeth Kumar Singh), సయామీ ఖేర్(Sayami Kher), రెజీనా కసాండ్రా(Regina Cassandra) కీలక పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ మూవీ ఏప్రిల్ 10న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇక ఇప్పటికే ‘జాట్’ నుంచి విడుదలైన పోస్టర్స్(Posters), టీజర్(Teaser) అందరిలో క్యూరియాసిటీని పెంచాయి.

అయితే నిన్న అనగా మార్చి 22న ఈ మూవీ ట్రైలర్(Trailer) రిలీజ్ కావాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల వాయిదా వేశారు. ఈ క్రమంలో తాజాగా మళ్లీ కొత్త ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ మేరకు ప్రీ ట్రైలర్ వీడియోను రిలీజ్ చేస్తూ.. జాట్ ట్రైలర్ వీడియో 24న అనగా రేపు రానుందని వెల్లడించారు. ప్రస్తుతం ప్రీ ట్రైలర్ వీడియో సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.

Next Story