కొత్త బంతా.. పాత బంతా? అని ఆలోచించను : Mohammed Shami

by Vinod kumar |   ( Updated:2023-08-31 16:24:54.0  )
కొత్త బంతా.. పాత బంతా? అని ఆలోచించను : Mohammed Shami
X

న్యూఢిల్లీ : కొత్తి బంతి లేదా పాత బంతితో బౌలింగ్ చేయడం గురించి తాను ఆలోచించనని టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ తెలిపాడు. తాజాగా షమీ స్టార్ స్ట్పోర్ట్స్ మాట్లాడుతూ..‘మా బౌలింగ్ దళం బలంగా ఉంది. కాబట్టి, ఎవరు ఆడతారనేది టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటా.’ అని చెప్పాడు. రెడ్ బాల్, వైట్ బాల్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంటుందని, సరైన ప్రాంతాల్లో బంతులు వేస్తే ఏ బాల్‌తోనైనా ఇబ్బంది ఉండదన్నాడు. ‘100 శాతం ఇవ్వడమే లక్ష్యం. మనం 100 శాతం ఇస్తేనే ఫలితం ఉంటుంది. అందుకే, దృష్టి పెట్టడం, అమలు చేయడం చాలా ముఖ్యం.’ అని షమీ చెప్పుకొచ్చాడు.

అలాగే, మరో పేసర్ బుమ్రా గురించి మాట్లాడుతూ..‘అతని చాలా మిస్ అయ్యాం. బుమ్రా తిరిగివచ్చాడు. మా బౌలింగ్ దళం, ముఖ్యంగా వైట్‌బాల్ ఫార్మాట్‌లో బలంగా మారింది. అతను ఫిట్‌గా ఉన్నాడు. అద్భుతంగా ఆడుతున్నాడు. ఆసియా కప్‌లో రాణిస్తామని ఆశిస్తున్నా.’అని తెలిపాడు. ‘ట్రైనింగ్ క్యాంప్‌లోనే పెద్ద మ్యాచ్‌ల గురించి నిరంతరం సాధన చేస్తాం. మాకు నైపుణ్యం, మంచి బౌలింగ్ లైనప్ ఉంది. కాబట్టి, పరిస్థితుల గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు.’ అని షమీ చెప్పాడు. అయితే, వన్డే మ్యాచ్‌లు ఆడేటప్పుడు ఫోకస్‌గా ఉండాలని, సరైన ప్రణాళిక ఉండాలని తెలిపాడు.

Advertisement

Next Story