Heath Streak: 'నేను బతికే ఉన్నా.. అలాంటి రూమర్స్‌ బాధించాయి'.. జింబాబ్వే మాజీ కెప్టెన్

by Vinod kumar |
Heath Streak: నేను బతికే ఉన్నా.. అలాంటి రూమర్స్‌ బాధించాయి.. జింబాబ్వే మాజీ కెప్టెన్
X

దిశ, వెబ్‌డెస్క్: తాను మృతి చెందినట్లు సోషల్‌ మీడియాలో కథనాలు రావడంపై జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్‌ స్ట్రీక్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఇలాంటి కథనాలు మానసికంగా బాధకు గురి చేశాయని పేర్కొన్నాడు. తాను క్యాన్సర్‌తో పోరాడుతూనే ఉన్నానని.. బతికే ఉన్నట్లు స్పష్టం చేశాడు. ‘‘నేను కన్నుమూసినట్లు వచ్చిన వార్తలన్నీ రూమర్లే. అదంతా అబద్ధం. బతికే ఉన్నా. మరీ ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో సోషల్‌ మీడియాలో ఇలాంటివి ఎక్కువై పోయాయి. ఇలాంటి వార్తలను వ్యాప్తి చేసిన వారు క్షమాపణలు చెబుతారని ఆశిస్తున్నా. ఇవి నన్నెంతో బాధించాయి’’ అని మీడియాతో స్ట్రీక్‌ మాట్లాడాడు.

కలవరం రేపిన ఒలొంగ ట్వీట్‌..

మొదట హీత్ స్ట్రీక్‌ తుది శ్వాస విడిచినట్లు జింబాబ్వే మాజీ ఆటగాడు హెన్రీ ఒలొంగ ట్విటర్ వేదికగా వెల్లడించాడు. అయితే, కాసేపటికే తన పొరపాటును సరి చేసుకుంటూ మరొక ట్వీట్ చేశాడు. ‘‘జింబాబ్వే క్రికెట్‌ దిగ్గజం హీత్ స్ట్రీక్‌ మరణ వార్తలన్నీ రూమర్లే. స్ట్రీక్‌ అద్భుతంగా కోలుకుంటున్నాడు. అతడితో నేరుగా మాట్లాడా.. అతడు చాలా బాగున్నాడు’’ అంటూ పేర్కొన్నాడు.

Advertisement

Next Story