- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌కు హుస్సాముద్దీన్
న్యూఢిల్లీ : త్వరలో జరగబోయే పురుషుల వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో 13 మంది భారత బాక్సర్లు పాల్గొననున్నారు. ఈ విషయాన్ని బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఎఫ్‌ఐ) శనివారం వెల్లడించింది. 2019 వరల్డ్ చాంపియన్‌షిప్ సిల్వర్ మెడలిస్ట్ అమిత్ పంఘల్ వరల్డ్ చాంపియన్‌షిప్ ప్రమాణాలను అందుకోకపోవడంతో బీఎఫ్‌ఐ అతన్ని పక్కనపెట్టింది. ఆరుసార్లు ఏషియన్ చాంపియన్‌షిప్ విజేత శివ థాపా, 2019 ఏషియన్ చాంపియన్‌షిప్ సిల్వర్ మెడలిస్ట్ దీపక్ బోరియా భారత బృందానికి నాయకత్వం వహించనున్నారు.
తెలంగాణ బాక్సర్ మహ్మద్ హుసాముద్దీన్ పేరు సైతం ప్రధాన బాక్సర్ల జాబితాలో ఉన్నది. అతను 57 కేజీల కేటగిరీలో పోటీపడుతున్నారు. 2018, 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో హుస్సాముద్దిన్ కాంస్యం సాధించాడు. తాష్కెంట్ వేదికగా ఏప్రిల్ 30 నుంచి మే 14 వరకు పురుషుల వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ జరగనుంది. టోర్నీకి ముందు మల్టీ నేషన్ ట్రైనింగ్ క్యాంప్ కోసం ఏప్రిల్ 17న భారత బాక్సర్లు తాష్కెంట్‌కు బయల్దేరనున్నారు.
భారత బృందం : గోవింద్ సహాని(48 కేజీలు), దీపక్ బోరియా(51 కేజీలు), సచిన్ సివాచ్(54 కేజీలు), మహ్మద్ హుస్సాముద్దీన్(57 కేజీలు), వారిందర్ సింగ్(60 కేజీలు), శివ థాపా(63.5 కేజీలు), ఆకాశ్ సాంగ్వాన్(67 కేజీలు), నిశాంత్ దేవ్(71 కేజీలు), సుమిత్ కుండు(75 కేజీలు), ఆశిష్ చౌదరి(80 కేజీలు), హర్ష్ చౌదరి(86 కేజీలు), నవీన్ కుమార్(92 కేజీలు), నరేందర్ బెర్వాల్(92+కేజీలు)