Swapnil Kusale : ఒలింపిక్స్‌లో కాంస్యం.. సెంట్రల్ రైల్వేలో స్వప్నిల్‌కు ప్రమోషన్

by Harish |
Swapnil Kusale : ఒలింపిక్స్‌లో కాంస్యం.. సెంట్రల్ రైల్వేలో స్వప్నిల్‌కు ప్రమోషన్
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. 50 మీటర్ల రైఫిల్ త్రి పొజిషన్స్ ఈవెంట్‌లో అతను మెడల్ గెలుచుకున్నాడు. మహారాష్ట్రకు చెందిన 22 ఏళ్ల స్వప్నిల్ షూటింగ్‌లో రాణిస్తూనే సెంట్రల్ రైల్వేలో టికెట్ కలెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన అతనికి సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. స్వప్నిల్‌కు ప్రమోషన్ ఇచ్చింది.

అఫీషియల్ గ్రేడ్‌గా ప్రమోట్ చేస్తూ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్‌డీ)గా నియమించినట్టు సెంట్రల్ రైల్వే జీఎం రాంకరన్ యాదవ్ వెల్లడించారు. ‘సెంట్రల్ రైల్వేలో పనిచేసే ఓ ఉద్యోగి ఒలింపిక్స్‌లో పతకం సాధించడం సెంట్రల్ రైల్వేకు చాలా పెద్ద విషయం. అతన్ని చూసి గర్వపడుతున్నాం. అతను త్వరలోనే అఫీషియల్ గ్రేడ్‌గా పదోన్నతి పొందుతాడు. అతన్ని ఓఎస్‌డీగా నియమిస్తారు.’ అని తెలిపారు. కాగా, ఒలింపిక్స్ చరిత్రలో 50 మీటర్ల రైఫిల్ త్రి పొజిషన్స్ ఈవెంట్‌లో పతకం గెలవడం భారత్‌కు ఇదే తొలిసారి.

Advertisement

Next Story

Most Viewed