నాలుగో స్థానంలో అతడు ఆడితే ఫిట్‌ అయిపోతాడు : Shikhar Dhawan

by Vinod kumar |
నాలుగో స్థానంలో అతడు ఆడితే ఫిట్‌ అయిపోతాడు : Shikhar Dhawan
X

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్‌ కప్‌ జట్టులో తనకు స్థానం వస్తుందో లేదో అనే దాని గురించి ఆలోచించడం లేదని శిఖర్ ధావన్‌ వ్యాఖ్యానించాడు. అయితే, ఆసియా గేమ్స్‌ కోసం తనను ఎంపిక చేస్తారని భావించినా.. చోటు దక్కకపోవడంతో ఆశ్చర్యానికి గురైనట్లు పేర్కొన్నాడు. అలాగే ప్రపంచకప్‌లో నాలుగో స్థానంపైనా తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘‘భారత్‌కు గొప్ప అవకాశాలు ఉన్నాయి. అనుభవం, యువతరంతో కూడిన జట్టు బరిలోకి దిగనుంది. స్వదేశంలో జరగనుండటం కూడా టీమ్‌ఇండియాకు కలిసొస్తుంది. కీలకమైన నాలుగో స్థానంలో సూర్యకుమార్‌ ఆడితే బాగుంటుంది. అతడు ఇక్కడ ఫిట్‌ అయిపోతాడు’’ అని ధావన్‌ తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed