ICC Women T20 Rankings: టాప్-10లో హర్మన్‌ప్రీత్ కౌర్..

by Vinod kumar |
ICC Women T20 Rankings: టాప్-10లో హర్మన్‌ప్రీత్ కౌర్..
X

న్యూఢిల్లీ : ఐసీసీ ఉమెన్స్ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ర్యాంక్ మెరుగుపడింది. మంగళవారం ఐసీసీ ఉమెన్స్ టీ20, వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. తాజా ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్ విభాగంలో హర్మన్‌ప్రీత్ కౌర్ 4 స్థానాలు ఎగబాకి టాప్-10లో చోటు దక్కించుకుంది. నటాలి స్కివర్(ఇంగ్లాండ్), చమరి ఆటపట్టు(శ్రీలంక)లతో కలిసి 10వ ర్యాంక్‌ను పంచుకుంది. బంగ్లాదేశ్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించడం ఆమె ర్యాంక్‌ మెరుగుదలకు సహాయపడింది. భారత్ తరఫున టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్న మరో స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన 3వ స్థానాన్ని పదిలం చేసుకుంది.

ఆస్ట్రేలియాకు చెందిన తహిలా మెక్‌గ్రాత్ టాప్ పొజిషన్‌లో కొనసాగుతున్నది. బౌలింగ్ విభాగంలో దీప్తి శర్మ 3వ స్థానాన్ని నిలబెట్టుకోగా.. రేణుక సింగ్ ఒక్క స్థానాన్ని కోల్పోయి 9వ ర్యాంక్‌కు పడిపోయింది. ఆల్‌రౌండర్ విభాగంలో దీప్తి శర్మ 4వ ర్యాంక్‌ను కాపాడుకున్నది. వన్డే ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే బ్యాటింగ్ విభాగంలో హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన వరుసగా 6, 7 ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నారు. బౌలింగ్ విభాగంలో రాజేశ్వరి గైక్వాడ్ 8వ స్థానంలో, దీప్తి శర్మ 10వ స్థానంతో టాప్-10లో నిలిచారు. ఆల్‌రౌండర్ విభాగంలో దీప్తి శర్మ 6వ ర్యాంక్‌లో ఉన్నది.

Advertisement

Next Story