మ్యాచ్ లో ఓడినా సంతోషంగానే ఉంది: కెప్టెన్ బెన్ స్టోక్స్

by Shiva |
మ్యాచ్ లో ఓడినా సంతోషంగానే ఉంది: కెప్టెన్ బెన్ స్టోక్స్
X

దిశ, వెబ్ డెస్క్: న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌లో కీలక సమయంలో తాను, జోరూట్ ఔటవ్వడమే విజయవకాశాలను దెబ్బతీసిందని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అన్నాడు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది. తొలి ఇన్నింగ్స్‌లోనే మ్యాచ్‌పై పట్టు సాధించిన ఇంగ్లండ్ ఫాలోఆన్ ఆడించి భారీ మూల్యం చెల్లించుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ నుంచి అనూహ్య ప్రతి ఘటన ఎదురవ్వడంతో రెండో ఇన్నింగ్స్‌లో తమ బ్యాటర్లు విఫలమవ్వడంతో గెలవాల్సిన మ్యాచ్‌ను ఇంగ్లండ్ చేజార్చుకుంది. దీంతో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమంగా నిలిచింది.

ఈ ఓటమిపై స్పందించిన బెన్ స్టోక్స్.. ఓడినా రసవత్తరమైన ఓ టెస్ట్ మ్యాచ్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉందని తెలిపాడు. టెస్ట్ క్రికెట్ అంటే ఏంటో ఈ మ్యాచ్ చూపించిందని తెలిపాడు. అసలు సిసలు టెస్ట్ మ్యాచ్ మజాను అభిమానులకు అందించిందని, ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్ల భావోద్వేగాలు తారా స్థాయికి చేరాయని తెలిపాడు. న్యూజిలాండ్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరిచారని పేర్కొన్నారు.

ఈ తరహా గొప్ప మ్యాచ్‌లో భాగస్వామ్యమవడం సంతోషంగా ఉంది. తాను, జోరూట్ కలిసి నెలకొల్పిన భాగస్వామ్యాన్ని విడదీయడం కివీస్‌కు మరింత లాభం చేకూర్చిందని తెలిపాడు. మా భాగస్వామ్యాన్ని విడదీయడానికి టామ్ లాథమ్ పై ఎత్తులు వేస్తాడని మేం ముందే గ్రహించాం. కానీ అతని వ్యూహాన్ని తిప్పికొట్టలేకపోయాం. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటివి సర్వసాధారణమేనని బెన్ స్టోక్స్ తన అభిప్రాయాన్ని వెల్లిబుచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed