యూ ముంబాపై హర్యానా విజయం

by Swamyn |
యూ ముంబాపై హర్యానా విజయం
X

దిశ, స్పోర్ట్స్: ప్రో కబడ్డీ లీగ్‌(పీకేఎల్)లో భాగంగా సొంతగడ్డపై శనివారం జరిగిన మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ అదరగొట్టింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు చేరిన హర్యానా.. తాజా మ్యాచ్‌లో యూ ముంబాపై 46-40 తేడాతో విజయం సాధించింది. రైడర్ విశాల్ 15 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు, యూ ముంబా ఆటగాళ్లలో ఎవరూ 9 కంటే ఎక్కువ పాయింట్ల సాధించకపోయినా ప్రత్యర్థికి గట్టిపోటీనిచ్చారు. చివర్లో 6 పాయింట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత జరిగిన రెండో మ్యాచ్‌లో యూపీ యోధాస్‌పై గుజరాత్ జెయింట్స్ 36-29 తేడాతో ఘన విజయం సాధించింది. గుజరాత్ ఇప్పటికే క్వార్టర్స్‌లోకి చేరుకోగా, యూపీ జట్టు చివరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది. తాజా మ్యాచ్‌లో గుజరాత్ రైడర్ పర్టీక్ 12 పాయింట్లు సాధించగా, డిఫెండర్ డీపక్ సింగ్ 6 పాయింట్లు తీసుకొచ్చాడు. యూపీ తరఫున రైడర్ గగన గౌడ మాత్రమే 9 పాయింట్లతో రాణించాడు.


Advertisement

Next Story