Glenn McGrath: ఆ ఒక్కడు లేకపోతే సిరీస్ క్లీన్ స్వీప్ అయ్యేది.. మెక్‌గ్రాత్ సంచలన వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2025-01-02 04:00:47.0  )
Glenn McGrath: ఆ ఒక్కడు లేకపోతే సిరీస్ క్లీన్ స్వీప్ అయ్యేది.. మెక్‌గ్రాత్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో భాగంగా మెల్‌బోర్న్ (Melbourne) వేదికగా ఆస్ట్రేలియా (Australia)తో జరిగిన నాలుగో టెస్ట్‌లో భారత్ 184 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. దీంతో ఆసిస్ సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ (Glenn McGrath) సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు జస్ర్పీత్ బుమ్రా (Jasrpeet Bumrah)నే లేకపోతే టీమిండియా (Team India) చిత్తుగా ఓడేదని.. ఆసిస్ క్లిన్ స్వీప్ చేసేదని కామెంట్ చేశారు. బుమ్రా బౌలింగ్ చక్కని లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్‌తో అద్భుత ప్రదర్శన కరబరుస్తున్నాడని ప్రశంసించారు. బంతిపై నియంత్రణ, సామర్థ్యం, పరిస్థితులను అర్థం చేసుకోవడంపై బుమ్రాకు మంచి నైపుణ్యం ఉందన్నారు. పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవడంలో అతడికి అతడే సాటి అని కొనియాడారు. కేవలం అతడి బౌలింగ్ వల్లే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ హోరాహోరీగా కొనసాగుతోందని, బుమ్రాకు తాను ఓ డై హార్డ్ ఫ్యాన్స్‌నని అన్నారు.

కాగా, ఈ సీరీస్‌లో మొత్తం నాలుగు టెస్ట్‌లు ఆడిన జస్ప్రీత్ బుమ్రా (Jasrpeet Bumrah) ఏకంగా 30 వికెట్లను పడగొట్టాడు. ఏ బౌలర్ కూడా అతడి దారిదాపుల్లో లేరు. ఒంటి చేత్తో పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా (Team India)కు అద్భుత విజయాన్ని కట్టబెట్టాడు. ఆ తరువాత జరిగిన మూడు టెస్ట్‌ల్లోనూ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ జట్టులో కీలకంగా వ్యవహరిస్తున్నాడు.

Advertisement

Next Story

Most Viewed