- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Gautam Gambhir : మళ్లీ కేకేఆర్ జట్టులో చేరిన గౌతమ్ గంభీర్..
దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ ఆటగాడు, డేర్ & డాషింగ్ బ్యాటర్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో ఫైర్ బ్రాండ్ గా గౌతమ్ గంభీర్ పేరు సంపాదించుకున్నాడు. ఈయన ఐపీఎల్ లో అత్యధికంగా కేకేఆర్ జట్టు తరఫున ఆడి ఆ జట్టుకు 2012, 2014 ఐపిఎల్ టైటిల్‌లను కూడా తీసుకొచ్చాడు. కాగా ప్రస్తుతం గంభీర్ ఢిల్లీ నుంచి ఎంపీగా కొనసాగుతున్నాడు. అయితే కోల్‌కతా నైట్ రైడర్స్ నుంచి బయటకు వెళ్లిన ఆయన సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి కేకేఆర్ జట్టుతో చేరనున్నాడు. 2024 ఐపీఎల్ సీజన్ కు సంబంధించిన వేలం కంటే ముందే గంభీర్ కేకేఆర్ మెంటర్‌గా చేరారు. గంభీర 2011 నుంచి 2017 వరకు ఆ జట్టులోనే కొనసాగాడు అనంతరం.. లక్నో సూపర్ జెయింట్స్ (LSG)లో రెండు సంవత్సరాలు పనిచేశారు.
కేకేఆర్ జట్టులోకి తన పునరాగమనం గురించి గంభీర్ ఇలా అన్నాడు, "నేను సాధారణంగా భావోద్వేగాలకు లోనవుతాను, కానీ ఇది భిన్నంగా కనిపిస్తుంది. ఆ ఐకానిక్ పర్పుల్, బంగారాన్ని ధరించడం గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు మండుతున్న అభిరుచి ఉంది.. నేను KKRలో తిరిగి చేరడం మాత్రమే కాదు.. నేను సంతోషంగా నగరానికి తిరిగి వస్తున్నాను.. నాకు చాలా ఆకలిగా ఉందని గంభీర్ తెలిపారు. అలాగే గంభీర్‌ని తిరిగి KKRకి స్వాగతిస్తూ ఆ జట్టు సహా యజమాని షారుఖ్ ఖాన్ ఇలా అన్నాడు. "గౌతమ్ ఎప్పుడూ మా కుటుంబంలో భాగమే, ఇప్పుడు అతను 'మెంటర్'గా కొత్త పాత్రలో తిరిగి వచ్చాడు. అతని లేకపోవడం చాలా లోతుగా భావించబడిందని షారుఖ్ అన్నాడు.
- Tags
- gautam gambhir