Gautam Gambhir : భారత జట్టుతో కలవనున్న గంభీర్

by Sathputhe Rajesh |   ( Updated:2024-12-02 16:20:36.0  )
Gautam Gambhir : భారత జట్టుతో కలవనున్న గంభీర్
X

దిశ, స్పోర్ట్స్ : భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తిరిగి టీంఇండియాతో కలవనున్నారు. వ్యక్తిగత కారణాలతో తొలిటెస్ట్ తర్వాత భారత్‌కు వచ్చిన గంభీర్ మంగళవారం తిరిగి జట్టుతో కలుస్తారు. గంభీర్ గైర్హాజరుతో కోచింగ్ స్టాఫ్ అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్, మోర్నె మోర్కల్‌లు క్యాన్ బెర్రాలో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్, జట్టు శిక్షణను పర్యవేక్షించారు. ఆస్ట్రేలియాకు చేరుకోనున్న గంభీర్‌కు రెండో టెస్ట్ మ్యాచ్‌లో స్టార్ బ్యాట్స్‌మెన్లు రోహిత్, గిల్ ఎంపిక అంశం సవాల్‌గా మారనుంది. తొలి టెస్టులో రోహిత్, గిల్ గైర్హాజరుతో దేవ్‌దత్ పడిక్కల్, ధ్రువ్ జురేల్‌లను భారత్ ఆడించింది. రోహిత్ స్థానంలో కేఎల్ రాహుల్ ఓపెనింగ్‌కు దిగాడు. అయితే రాహుల్ రెండు ఇన్నింగ్స్‌లో 26, 77 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. దీంతో సెకండ్ టెస్ట్ మ్యాచ్‌లో ఓపెనింగ్‌లో ఎవరిని దించాలనే అంశంలో సైతం గంభీర్ కసరత్తు చేయాల్సి ఉంది. డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా డే అండ్ నైట్ పింక్ బాల్ టెస్ట్ ప్రారంభం కానుంది.

Advertisement

Next Story