- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకున్న అల్కరాజ్.. నదాల్ తర్వాత అతనే
దిశ, స్పోర్ట్స్ : స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ మూడో గ్రాండ్‌స్లామ్‌పై కన్నేశాడు. ఇప్పటికే యూఎస్ ఓపెన్(2022), వింబుల్డన్(2023) నెగ్గిన అతను ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాడు. తాజాగా ఎర్రమట్టి కోర్టులో అతను ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన సెమీస్‌లో అల్కరాజ్ వరల్డ్ నం.1 జెన్నిక్ సిన్నర్(ఇటలీ)కి షాకిచ్చాడు. ఐదు సెట్లపాటు రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో అల్కరాజ్ 2-6, 6-3, 3-6, 6-4, 6-3 తేడాతో సిన్నర్‌పై పోరాడి గెలిచాడు.
4 గంటలకుపైగా జరిగిన మ్యాచ్‌లో మొదట అల్కరాజ్‌కు శుభారంభం దక్కలేదు. తొలి సెట్‌ను సిన్నర్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాతి సెట్‌లో సిన్నర్‌కు అల్కరాజ్ బదులిచ్చాడు. 4వ, 6వ గేమ్‌ల్లో ప్రత్యర్థి సర్వీస్‌లను బ్రేక్ చేసి రెండు సెట్‌ను నెగ్గాడు. సిన్నర్ కూడా వెనక్కి తగ్గలేదు. మూడో సెట్‌లో దూకుడుగా ఆడిన అతను వరసగా 4, 5, 6, 7 గేమ్‌ల్లో పైచేయి సాధించి మ్యాచ్‌లో ఆధిక్యంలోకి వెళ్లాడు. అనంతరం అల్కరాజ్ బలంగా పుంజుకున్నాడు. సిన్నర్ పోటీనిచ్చినా అతన్ని నిలువరించాడు. విన్నర్లతో విరుచుకపడిన అల్కరాజ్ మిగతా రెండు సెట్లను దక్కించుకుని విజేతగా నిలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకోవడం అల్కరాజ్‌కు ఇదే తొలిసారి. మొత్తంగా మూడో గ్రాండ్‌స్లామ్ ఫైనల్. అలాగే, 21 ఏళ్ల అల్కరాజ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో రఫెల్ నదాల్(2000) తర్వాత ఫైనల్‌కు చేరిన రెండో యంగెస్ట్ ఆటగాడిగా నిలిచాడు.