బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న భారత మాజీ కోచ్.. బీసీసీఐ ఆర్థిక సాయం

by Ramesh N |
బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న భారత మాజీ కోచ్.. బీసీసీఐ ఆర్థిక సాయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, హెడ్‌కోచ్ అన్షుమన్ గైక్వాడ్ (71) బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. అతడికి చికిత్స కావాల్సిన ఆర్థిక సాయం కోసం మాజీ క్రికెటర్లు నుంచి బీసీసీఐకి విజ్ఞప్తులు చేశారు. ఈ క్రమంలోనే గైక్వాడ్ చికిత్స‌కు బీసీసీఐ ఆర్థిక సాయం చేసేందుకు సిద్దమైంది. తక్షణమే రూ. కోటి విడుదల చేయాలని బీసీసీఐ కార్యదర్శి జై షా ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా అన్షుమన్ కుటుంబ సభ్యులతో జై షా ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడారు. ఆయన త్వరగా కోలుకోవాలని వారికి బోర్డు సహకారం ఉంటుందని భరోసా ఇచ్చినట్టు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ తాజాగా ప్రకటనలో తెలిపింది.

అయితే, అన్షుమన్ గైక్వాడ్ లండన్‌లో క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నారు. తన సహచర ఆటగాళ్లు, మాజీ భారత క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, గవాస్కర్, అమర్‌నాథ్, వెంగ్ సర్కార్, మదన్‌లాల్ లాంటి వారు గైక్వాడ్‌ చికిత్సకు నిధులు సమీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే కపిల్ దేవ్ అతనికి బీసీసీఐ సాయం చేయాలని లేఖ రాశారు. తన పెన్షన్ డబ్బులు కూడా ఇచ్చేస్తానని చెప్పుకొచ్చారు. కాగా, అన్షుమన్ గైక్వాడ్ 1974లో క్రికెట్‌లోకి అడుగుపెట్టి భారత జట్టు తరపున 15 వన్డే మ్చాచ్‌లు, 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. అంతేగాక రెండు సార్లు టీమ్ ఇండియాకు హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

Advertisement

Next Story

Most Viewed