- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా నెంబర్ చాలామంది దగ్గర ఉన్న.. ఆ సమయంలో ధోని ఒక్కడే మెసేజ్ చేశాడు: kohli
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దాదాపు రెండేళ్లుగా ఫామ్ లేమి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అలవోకగా సెంచరీలు బాదే కోహ్లీ.. రన్స్ చేయడానికి తంటాలు పడుతున్నాడు. దీంతో కొందరు మాజీ క్రికెటర్లు బహిరంగంగా కోహ్లీపై విమర్శలు గుప్పించారు. మరికొందరు ఓ అడుగు ముందుకేసి అతడిని జట్టు నుండి తప్పించాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫామ్ లేమితో ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న కోహ్లీ.. ఆసియా కప్ 2022లో అదరగొడుతున్నాడు. కొంత కాలం రెస్ట్ తీసుకున్న ఈ రన్ మెషిన్.. గ్యాప్ అనంతరం అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఆసియా కప్ 2022లో భాగంగా ఆడిన మూడు మ్యాచుల్లో.. రెండు హాఫ్ సెంచరీలు బాది విమర్శకుల నోర్లు మూయించాడు.
కాగా, ఆదివారం పాక్‌తో మ్యాచ్ అనంతరం చాలా రోజుల తర్వాత కోహ్లీ విలేకర్ల సమావేశానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్ట్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన తర్వాత.. తనకు ధోని మాత్రమే పర్సనల్‌గా మెసేజ్ చేశాడని తెలిపాడు. తన నెంబర్ చాలా మంది దగ్గర ఉందని.. అయినా ఎవరూ మెసేజ్, ఫోన్ కానీ చేయలేదని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అంతేకాకుండా తనపై విమర్శలు చేసే వారికి కోహ్లీ కౌంటర్ ఇచ్చాడు. చాలా మంది టీవీలు, సోషల్ మీడియాలో సలహాలు ఇచ్చారని.. డైరెక్ట్‌గా ఎవరూ మాట్లాడలేదని పేర్కొన్నాడు. ఎవరికైనా ఒక మంచి విషయాన్ని చెప్పాలనుకుంటే అది వారి దగ్గరికి వెళ్లి చెప్పాలని.. అంతేకానీ దూరంగా ఉండి టీవీలు, సోషల్ మీడియాలో సలహాలు ఇవ్వడం కరెక్ట్ కాదని అన్నాడు. తాను ఎవరికైనా మంచి చెప్పాల్సి ఉంటే వారి దగ్గరికి వెళ్లి కలిసి చెపుతానని అన్నాడు. ఇక ధోని సారథ్యంలో ఆడినప్పుడు తాను ఎప్పుడు ఇన్ సెక్యూర్‌గా ఫీల్ అవ్వలేదని వెల్లడించాడు.
Also Read : నా క్రికెట్ కెరీర్ ఆ రోజే ముగిసిందనుకున్న.. కోహ్లీ షాకింగ్ కామెంట్స్