IPL 2024: టీమిండియా మాజీ చీఫ్‌కు లక్నో సూపర్‌ జెయింట్స్‌లో కీలక పదవి

by Vinod kumar |
IPL 2024: టీమిండియా మాజీ చీఫ్‌కు లక్నో సూపర్‌ జెయింట్స్‌లో కీలక పదవి
X

దిశ, వెబ్‌డెస్క్: లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఫ్రాంచైజీ 2024 ఐపీఎల్‌ సీజన్‌కు గానూ కీలకమైన స్ట్రాటెజిక్‌ కన్సల్టెంట్‌గా టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్‌ నియమించింది. గడిచిన నెలలో తమ ప్రధాన కోచ్‌ పదవి నుంచి ఆండీ ఫ్లవర్‌ను తప్పించి.. అతని స్థానంలో ఆసీస్‌ మాజీ ఓపెనర్‌ జస్టిన్‌ లాంగర్‌ను నియమించిన విషయం తెలిసిందే. వ్యూహాత్మక సలహాదారుగా నియమించినట్లు ఎల్‌ఎస్‌జీ యాజమాన్యం ఇవాళ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

1999, 2000 సంవత్సరాల్లో భారత్‌ తరఫున 17 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడిన ప్రసాద్‌.. 2016 నుంచి 2020 వరకు భారత జాతీయ క్రికెట్‌ జట్టు ప్రధాన సెలెక్టర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల ముందే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కూడా తమ ప్రధాన కోచ్‌ పదవి నుంచి బ్రియాన్‌ లారాకు ఉద్వాసన పలికి, అతని స్థానంలో న్యూజిలాండ్‌ మాజీ ఆటగాడు డేనియల్‌ వెటోరీని హెడ్‌గా కోచ్‌గా నియమించుకుంది.

Advertisement

Next Story

Most Viewed