నీలో మస్త్ షేడ్స్ ఉన్నాయ్ ‘గుల్బాదిన్’..

by Hajipasha |
నీలో మస్త్ షేడ్స్ ఉన్నాయ్ ‘గుల్బాదిన్’..
X

దిశ, స్పోర్ట్స్ : అప్ఘాన్ ప్లేయర్ గుల్బాదిన్ నయీబ్ పేరు ప్రస్తుతం నెట్టింట మారుమోగుతోంది. బంగ్లాదేశ్‌తో జరిగిన గత మ్యాచులో అప్ఘానిస్తాన్ ఘన విజయం సాధించి ఆ జట్టు టీ20 వరల్డ్ కప్‌ చరిత్రలోనే తొలిసారిగా సెమీస్‌కు బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. అయితే, మ్యాచ్ జరిగే క్రమంలో అప్ఘాన్ ఆటగాడు గుల్బాదిన్ కావాలనే మ్యాచ్‌ ఆలస్యం అయ్యేలా చేశాడని వివర్శలు వెల్లువెతుతున్నాయి. బంగ్లా జట్టు స్కోరు 81/7 వద్ద ఉన్నప్పుడు లైట్‌గా వర్షం పడింది. ఆ టైంలో మ్యాచ్ అర్ధాంతరంగా నిలిచిపోతే డక్‌వర్త్ లూయీస్ ప్రకారం బంగ్లా జట్టు విజయానికి 2 పరుగులు వెనకబడింది. ఈ క్రమంలోనే అప్ఘాన్ హెడ్‌కోచ్ ట్రాట్ మ్యాచ్ డిలే చేయాలని సంకేతాలు ఇచ్చినట్లు కనిపించడంతో స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న గుల్బాదిన్ ఒక్కసారిగా కిందపడిపోయాడు.తొడ కండరాలు పట్టేసాయని విలవిల లాడటంతో అతన్ని ఫీల్డ్ నుంచి బయటకు తీసుకెళ్లారు.

అయితే, మ్యాచ్ గెలిచిక మాత్రం మైదానం మొత్తం తిరుగుతూ తెగ సందడి చేశాడు. ఇదంతా గమనించిన మాజీ క్రికెటర్లు గుల్బాదిన్ తీరును తప్పుబడుతుండగా.. నెటిజన్లు మాత్రం ‘మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా నీలో.. అబ్బా కమలాసన్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా, ఇదంతా డ్రామా అని తేలితే ఐసీసీ ఆర్టికల్ 2.10.7 లెవల్ 1 లేదా 2 కింద నేరానికి పాల్పడినట్లు భావించి మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత లేదా రెండు డీ మెరిట్ పాయింట్లను ఫైన్‌గా విధించవచ్చు. ఒక ఏడాది 4 డీమెరిట్ పాయింట్లు వస్తే ఒక టెస్టు లేదా రెండు వన్డేలు, రెండు టీ20ల నుంచి వేటు పడనుంది.

Advertisement

Next Story

Most Viewed