WPL వేలం.. బేస్ ప్రైస్‌కు కూడా అమ్ముడుపోని స్టార్ ప్లేయర్స్

by Mahesh |   ( Updated:2023-02-14 06:34:55.0  )
WPL వేలం.. బేస్ ప్రైస్‌కు కూడా అమ్ముడుపోని స్టార్ ప్లేయర్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ముంబై వేదికగా నిర్వహించిన WPL మొట్టమొదటి వేలంలో చాలా మంది ప్లేయర్స్ మంచి ధర పలికి వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. సుమారు 450 మంది ప్లేయర్స్ కు పైగా పాల్గోన్న ఈ వేలంలో చాలా మంది ప్లేయర్స్ మంచి ధరను సంపాధించుకున్నారు. కానీ మరోపక్క.. ప్రపంచ వ్యాప్తం పేరుగాంచిన స్టార్ ప్లేయర్స్ మాత్రం.. ఈ వేలంలో వారి బేస్ ప్రైజ్ కు కూడా అమ్ముడు పోలేదు.

ముఖ్యంగా.. ఇంగ్లండ్ ఆల్-రౌండర్లు డాని వ్యాట్, కేథరీన్ స్కివర్-బ్రంట్, భారత ఫాస్ట్ బౌలర్ మేఘన సింగ్, అలాగే అలానా కింగ్, ప్రియా పునియా, పూనమ్ రౌత్, షార్లెట్ డీన్, చమరి అతపత్తు, సునే లూయస్ వంటి ఇతర ప్రముఖ ఆటగాళ్లును ఏ టీమ్ కూడా కొనడానికి ఇష్టపడక పోవడంతో వారికి ఈ మొట్టమొదటి WPL వేలంలో నిరాశే మిగలిందని చెప్పుకొవాలి.

Advertisement

Next Story