బెల్జియం చేతిలో భారత్ ఓటమి

by Harish |
బెల్జియం చేతిలో భారత్ ఓటమి
X

దిశ, స్పోర్ట్స్ : ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రొ లీగ్‌లో భాగంగా యూరోప్ పర్యటనలో భారత పురుషుల హాకీ జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. మొదటి మ్యాచ్‌లో అర్జెంటీనాపై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో బెల్జియం చేతిలో 4-1 తేడాతో భారత్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి దూకుడు ముందు టీమ్ ఇండియా సత్తాచాటలేకపోయింది. ఆఖర్లో 55వ నిమిషంలో అభిషేక్ చేసిన ఫీల్డ్ గోలే భారత్‌కు తొలి, చివరిది. బెల్జియం తరపున హెండ్రిక్స్ అలెగ్జాండర్ రెండు గోల్స్‌తో సత్తాచాటగా.. డినేయర్ ఫెలిక్స్, చార్లియర్ సెడ్రిక్ చెరో గోల్ చేశారు. మహిళల టోర్నీలో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో మహిళల జట్టు కూడా బెల్జియం చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. శనివారం భారత పురుషుల, మహిళల జట్లు మరోసారి బెల్జియం జట్లతో తలపడనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed