మహిళల టీ20 వరల్డ్ కప్.. చరిత్రలో అత్యంత ఫాస్టెస్ట్ బాల్..

by Mahesh |
మహిళల టీ20 వరల్డ్ కప్.. చరిత్రలో అత్యంత ఫాస్టెస్ట్ బాల్..
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళల టీ20 ప్రపంచకప్ సెమిఫైనల్స్ ముగిశాయి. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరగనుంది. కాగా ఇప్పటి వరకు ఈ వరల్డ్ కప్ టోర్నీలో అత్యంత వేగంగా బౌలింగ్ చేసిన ప్లేయర్‌గా.. దక్షిణాఫ్రికా చెందిన ఫాస్ట్ బౌలర్ షబ్నిమ్ ఇస్మాయిల్ నిలిచింది. శుక్రవారం ఇంగ్లాండ్ తో జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో గంటకు 128 కి.మీ వేగంతో బంతిని విసిరి ఈ రికార్డును నెలకొల్పింది. షబ్నిమ్ ఈ మ్యాచ్‌లో 4-0-27-3 పాయింట్లను నమోదు చేసింది. అలాగే.. ఈ మ్యాచ్‌లో , దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్‌ను ఓడించి తొలిసారి ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకుంది.

Advertisement

Next Story

Most Viewed