- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Shocking News : అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన టీం ఇండియా మాజీ క్రికెటర్ కొడుకు
దిశ, స్పోర్ట్స్ : భారత మాజీ క్రికెటర్, మాజీ కోచ్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ బంగర్ సెక్స్ ట్రాన్స్ఫార్మేషన్ సర్జరీ చేయించుకున్నాడు. తన పేరును సైతం అనయ బంగర్‌గా సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. 23 ఏళ్ల ఆర్యన్ హార్మోన్ రిప్లేస్‌మెంట్ థెరపీ చేయించుకుంటున్నాడు. అనయ ప్రస్తుతం మాంచెస్టర్‌లో నివసిస్తుంది. లోకల్ క్రికెట్ క్లబ్ ఇస్లాం జింఖానా తరఫున ఆడుతోంది. ఆగస్టు 23న తాను సోషల్ మీడియాలో చేసిన పోస్టులో క్రికెట్‌పై తనకున్న ప్రేమను అనయ తెలిపింది. తన తండ్రి సంజయ్ బంగర్ నుంచి స్ఫూర్తి పొందినట్లు తెలిపింది. ‘చిన్ననాటి నుంచి క్రికెట్ నా జీవితంలో భాగమైంది. క్రికెటర్, కోచ్‌గా ఎదిగిన నా తండ్రిని చూసి ఆయన అడుగుజాడల్లో నడవాలని కలలు కన్నాను. ఆట పట్ల ఆయన చూపిన అభిరుచి, క్రమశిక్షణ, అంకితభావం నన్ను మరింత ఇన్స్‌పైర్ చేశాయి. క్రికెట్ నా ప్రేమ, నా ఆశయం, నా భవిష్యత్తు. నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడానికి నా జీవితం అంతా గడిపాను. అయితే ట్రాన్స్ వుమెన్‌గా మారేందుకు హార్మోన్ రిప్లేస్‌మెంట్ థెరపీ చేయించుకోవడంతో నా శరీరం చాలా మారిపోయింది. కండ బలం, అథ్లెటిక్ సామర్థ్యాలను కోల్పోతున్నాను. చాలా కాలంగా ప్రేమిస్తున్న ఆట నా నుంచి జారిపోతోంది. అని అనయ పోస్ట్ చేసింది.