England vs Australia:మెరిసిన ట్రావిస్ హెడ్,మాథ్యూ షార్ట్.. మొదటి T20లో ఆసీస్ ఘన విజయం

by Maddikunta Saikiran |
England vs Australia:మెరిసిన ట్రావిస్ హెడ్,మాథ్యూ షార్ట్.. మొదటి T20లో ఆసీస్ ఘన విజయం
X

దిశ, వెబ్‌డెస్క్:సౌతాంఫ్టన్(Southampton) వేదికగా ఇంగ్లాండ్(England)తో బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచులో ఆస్ట్రేలియా(Australia) 28 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది.ఈ మ్యాచులో ఇంగ్లాండ్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ తీసుకుంది.దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 19.3 ఓవర్లలో 179 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. కంగారూల తరుపున ఓపెనర్లు ట్రావిస్ హెడ్(Travis Head) ,మాథ్యూ షార్ట్(Matthew Short) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వీరిద్దరూ కలిసి పవర్ ప్లే లోనే 86 పరుగులు చేసి శుభారంభమందించారు.వీరిద్దరి భాగ్యస్వామ్యం విడిపోయిన తర్వాత వచ్చిన బ్యాటర్లు ఒక్కఒక్కరుగా పెవిలియన్ కు క్యూ కట్టడంతో ఆస్ట్రేలియా 10 వికెట్లు కోల్పోయి 179 పరుగులే చేసింది. ఆసీస్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్(23 బంతుల్లో 59 పరుగులు;8 ఫోర్లు,4 సిక్సులు),మాథ్యూ షార్ట్(26 బంతుల్లో 41 పరుగులు;4 ఫోర్లు,2 సిక్సులు) రాణించారు.ఇంగ్లాండ్ బౌలర్లలో లివింగ్ స్టన్(Livingstone) 3 వికెట్లు తీయగా ఆర్చర్(Archer), మహమూద్(Mahmood) తలో 2 వికెట్లు పడగొట్టారు.

అనంతరం 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 151 పరుగులకే చాప చుట్టేసింది. కంగారూల పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో టక టక వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు తరుపున లివింగ్ స్టన్ ఒక్కడే 27 బంతుల్లో 37 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.ఆస్ట్రేలియా బౌలర్లలో సీన్ అబ్బాట్(Sean Abbot) 3 వికెట్లతో రాణించగా హేజెల్ వుడ్(Hazlewood), జంపా(Zampa) కలిసి 4 వికెట్లు తీశారు.59 పరుగులతో రాణించిన ట్రావిస్ హెడ్ కు 'మ్యాన్ అఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. కాగా మూడు మ్యాచుల టీ20 సిరీస్ లో ఆస్ట్రేలియా (1-0) తో ఆధిక్యంలో నిలిచింది.రెండో టీ20 కార్డిఫ్(Cardiff) వేదికగా శుక్రవారం జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed