బ్రేకింగ్ న్యూస్.. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్

by Mahesh |   ( Updated:2023-07-30 03:30:00.0  )
బ్రేకింగ్ న్యూస్.. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ 37 ఏళ్ల వయసులో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో యాషెస్ టెస్టులో 3వ రోజు జరిగిన తర్వాత బ్రాడ్ తాను రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కాగా అతను ఇటీవల టెస్టు క్రికెట్ చరిత్రలో 600 వికెట్లు తీసిన రెండో ఫాస్ట్ బౌలర్‌గా బ్రాడ్ నిలిచిన సంతగతి తెలిసిందే. 2007 డిసెంబర్ 9న శ్రీలంకతో మొదటి టెస్ట్ మ్యాచ్ లోకి అరంగేట్రం చేశాడు. అలాగే 2006 ఆగస్టు 30 పాకిస్థాన్ మ్యాచుతో వన్డే జట్టులోకి, 2006 అగష్ట్ 28న టీ20‌లోకి అరంగేట్రం చేశాడు. బ్రాడ్ తన కెరీర్ లో ఇప్పటి వరకు టెస్టుల్లో 600, వన్డేల్లో 178, టీ20ల్లో 65 వికెట్లు తీసుకున్నాడు.

Advertisement

Next Story