Engagement Cermony: ఆ బ్యాడ్మింటన్ ప్లేయర్‌తో ప్రొడ్యూసర్ ఎంగేజ్‌మెంట్.. సీన్‌లోకి దర్శకుడు రాంగోపాల్ వర్మ

by Shiva |   ( Updated:2024-08-11 06:16:55.0  )
Engagement Cermony: ఆ బ్యాడ్మింటన్ ప్లేయర్‌తో ప్రొడ్యూసర్ ఎంగేజ్‌మెంట్.. సీన్‌లోకి దర్శకుడు రాంగోపాల్ వర్మ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ బ్యాట్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్, దర్శకుడు రాంగోపాల్ వర్మ మేనకోడలు, ప్రొడ్యూసర్ శ్రావ్య వర్మ ఒక్కటి కాబోతున్నారు. ఈ మేరకు తాము నిశ్చితార్థం కూడా చేసుకున్నట్లు శ్రావ్య తన సోషల్ మీడియా ఖాతాలో ఫొటోలను పోస్ట్ చేసింది. దీంతో ఎవరీ శ్రావ్య వర్మ అంటూ నెటిజన్లు గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు. స్టార్ హీరోలు అక్కినేని నాగార్జున, విజయ్ దేవరకొండ, విక్రమ్, వైష్ణవ్ తేజ్‌లకు శ్రావ్య కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఉన్నారు. అదేవిధంగా మహానటి ఫేమ్ కీర్తీ సురేశ్ హీరోయిన్‌గా ‘గుడ్ లక్ సఖి’ అనే సినిమాకు శ్రావ్య ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించారు.

Advertisement

Next Story

Most Viewed