Dutee Chand Doping Test: డోపింగ్ టెస్ట్‌లో రెండు సార్లు ఫెయిల్.. ద్యుతిచంద్‌పై నాలుగేళ్ల నిషేధం..

by Vinod kumar |
Dutee Chand Doping Test: డోపింగ్ టెస్ట్‌లో రెండు సార్లు ఫెయిల్.. ద్యుతిచంద్‌పై నాలుగేళ్ల నిషేధం..
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ఫాస్టెస్ట్ స్ప్రింటర్‌ ద్యుతిచంద్‌పై యాంటీ డోపింగ్‌ ఏజన్సీ నాలుగేళ్ల నిషేధాన్ని విధించింది. గతేడాది డిసంబర్‌లో ఆమెపై జరిపిన డోప్‌ టెస్టులో విఫలమైనందుకు నిషేధం విధిస్తున్నట్లు ప్యానెల్‌ పేర్కొంది. 2022 డిసెంబర్‌లో శాంపిల్స్ టెస్టు చేశామని, 2023, జనవరి నుంచి నిషేధం అమల్లోకి వస్తుందని తెలిపింది. దీంతో ఆమె సాధించిన మెడల్స్, బహుమతులను తిరిగిచ్చేయాల్సి ఉంటుందని పేర్కొంది. కాగా, 2011 ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్‌లో 100 మీటర్ పరుగు పందేంలో 11.17 సెకన్స్‌లో పూర్తి చేసి ద్యుతి రికార్డు సృష్టించింది.

Advertisement

Next Story

Most Viewed