భార్య వేధింపులు.. శిఖర్ ధావన్‌కు విడాకులు మంజూరు

by Javid Pasha |   ( Updated:2023-10-05 06:59:04.0  )
భార్య వేధింపులు.. శిఖర్ ధావన్‌కు విడాకులు మంజూరు
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ క్రికెటర్‌ శిఖర్ ధావన్‌ దంపతులు విడాకులు తీసుకున్నారు. శిఖర్ ధావన్, అతడి భార్య ఆయేషా ముఖర్జీకి ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు తాజాగా విడాకులు మంజూరు చేసింది. తనను ఆయేషా ముఖర్జీ మానసికంగా వేధిస్తుందని, ఆమె నుంచి తాను విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు గతంలో కోర్టులో శిఖర్ ధావన్ విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. శిఖర్ ధావన్ ఆరోపణలు నిజమేనని తేల్చింది.

భార్య వేధించినట్లు రుజువు కావడంతో తాజాగా శిఖర్ ధావన్ దంపతులకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. శిఖర్ ధావన్ పరువుకు భంగం కలిగేలా బీసీసీఐకు భార్య తప్పుడు సంకేతాలు పంపిందని, అలాగే ఆస్తులకు సంబంధించి అతడిని వేధించినట్లు తేలింది. అలాగే కుమారుడికి దూరంగా ఉండాలని, అతడిని చూడటానికి వీల్లేదని శిఖర్‌ను వేధించినట్లు కూడా కోర్టులో రుజువైంది. అలాగే శిఖర్ ఆస్తిలో వాటా కావాలని కూడా వేధించింది. ఈ ఆరోపణలు నిజం కావడంతో శిఖర్‌కు విడాకులు మంజూరయ్యాయి. అయితే రెండేళ్ల క్రితం తన భార్యతో విడిపోతున్నట్లు శిఖర్ ప్రకటించాడు. అప్పటినుంచి ఈ ఎపిసోడ్ కొనసాగుతోంది. శిఖర్ తనను వేధించాడంటూ భార్య చేసిన వ్యాఖ్యలు అప్పట్లో ప్రకంపనలు రేపాయి. కానీ అవన్నీ నిజం కాదని తేలిపోయాయి.

Advertisement

Next Story