వాళ్లు నన్ను స్లెడ్జింగ్ చేశారు : ధ్రువ్ జురెల్

by Harish |
వాళ్లు నన్ను స్లెడ్జింగ్ చేశారు : ధ్రువ్ జురెల్
X

దిశ, స్పోర్ట్స్ : ఈ ఏడాది ఇంగ్లాండ్‌పై ఐదు టెస్టుల సిరీస్‌తో భారత యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ టెస్టు అరంగేట్రం చేశాడు. 4వ టెస్టులో 90, 39 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన అతను భారత్ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ప్లేయర్లు అండర్సన్, జో రూట్, బెయిర్ స్టో నుంచి తాను స్లెడ్జింగ్ ఎదుర్కొన్నానని తాజాగా ధ్రువ్ జురెల్ తెలిపాడు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జురెల్ ఆ సంఘటనను గుర్తు చేసుకున్నాడు.

‘రెండో రోజు ముగిసే సమయానికి నేను 30 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాను. ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు. తర్వాతి రోజు గురించి ఆలోచిస్తున్నా. పాత బంతితో హాఫ్ సెంచరీ చేయాలా? లేదా కొత్త బంతిని ఎదుర్కోవాలా? అని ప్రణాళికలు చేస్తున్నా. కానీ, ఇంగ్లాండ్ కొత్త బంతి తీసుకునే ముందు నేను 36 పరుగులే చేయగలిగాను. అయితే, మొదటి నుంచి అండర్సన్, బెయిర్‌స్టో నన్ను స్టెడ్జింగ్ చేస్తున్నారు. వారికి జో రూట్ కూడా తోడవడంతో నేను షాక్ అయ్యాను. ఐపీఎల్‌లో మేమిద్దరం రాజస్థాన్ తరపున ఆడాం. ‘నన్నెందుకు స్లెడ్జింగ్ చేస్తున్నావు’ అని నేను అతన్ని అడిగా. ‘మనం ఇప్పుడు దేశానికి ఆడుతున్నాం’ అని రూట్ చెప్పాడు.’ అని జురెల్ చెప్పుకొచ్చాడు. కాగా బంగ్లాదేశ్‌తో జరిగే తొలి టెస్టుకు ధ్రువ్ జురెల్ ఎంపికైన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed