భారీగా బుల్డోజర్లు.. స్టేడియం కూల్చివేత

by Hajipasha |
భారీగా బుల్డోజర్లు.. స్టేడియం కూల్చివేత
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 ప్రపంచ కప్‌లో అతి తక్కువ పరుగులకు వేదికైన అమెరికాలోని నసావు క్రికెట్ స్టేడియాన్ని గురువారం నుంచి కూల్చివేయడం ప్రారంభించారు. బుధవారం ఈ స్టేడియంలో చిట్టచివరగా భారత్ వర్సెస్ అమెరికా మ్యాచ్ జరగగా..ఇందులో టీమిండియా ఘన విజయం సాధించి సూపర్ -8కు క్వాలిఫై అయ్యింది. ఇప్పటివరకు ఇందులో 8 మ్యాచులు జరిగాయి. చిట్టచివరి మ్యాచ్ జరిగే రోజునే స్టేడియం ఆవరణలో బుల్డోజర్లను మోహరించారు.కేవలం టీ20 వరల్డ్ కప్ కోసమే ఈ స్టేడియాన్ని టెంపరరీ పర్పస్‌లో నిర్మించగా..దీని కెపాసిటీ 34వేలు. జూన్ 9న జరిగిన భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్‌కు మాత్రమే ఈ స్టేడియం నిండిపోయింది. అయితే, ఈ వేదికగా జరిగిన అన్నిమ్యాచుల్లోనూ బౌలర్లే ఆధిపత్యం కనబరిచారు.నసావులో హయ్యెస్ట్ చేజింగ్ కూడా ఇండియాదే కావడం గమనార్హం. అమెరికా 111 పరుగులు చేయగా టీమిండియా చేమటోడ్చి గెలుపొందింది.ఈ పిచ్ వ్యవహరించిన తీరుపై అంతర్జాతీయ క్రికెట్ మండలి కూడా సీరియస్ అయ్యింది. ఈ క్రమంలోనే ఆరు వారాల వ్యవధిలో ఈ వేదికను పూర్తిగా తొలగించనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed