పాకిస్తాన్ కెప్టెన్‌ ఇంట్లో తీవ్ర విషాదం

by Gantepaka Srikanth |
పాకిస్తాన్ కెప్టెన్‌ ఇంట్లో తీవ్ర విషాదం
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్ క్రికెట్ టీమ్(Pakistan Cricket Team) కెప్టెన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కెప్టెన్ ఫాతిమా సనా(Fatima Sana) తండ్రి కన్నుమూశారు. గత కొంతకాలం క్రితం అనారోగ్యం బారినపడిన ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. పరిస్థితి విషమించి గురువారం తుదిశ్వాస విడిచారు. ఫాతిమా తండ్రి మృతి పట్ల తన తోటి క్రీడాకారులు, పాక్ క్రికెట్ బోర్డు మెంబర్లు సంతాపం ప్రకటిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం టీ20 ప్రపంచ కప్‌ ఆడేందుకు ఫాతిమా దుబాయ్ వెళ్లారు. అక్టోబర్ 11న ఆస్ట్రేలియాతో దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా కీలక మ్యాచ్ ఉంది. ఈ క్రమంలో తండ్రి చనిపోయిన వార్త తెలియడంతో ఫాతిమా హుటాహుటిన దుబాయ్ నుంచి కరాచీ బయలుదేరారు. ఈ మ్యాచ్‌కి పాక్ వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్న మునీబా అలీ సారథిగా వ్యవహరించనున్నారు. ఇప్పటివరకు టీ20 ప్రపంచ కప్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన పాకిస్తాన్ మహిళల టీమ్ ఒక మ్యాచ్‌లో గెలిచి.. మరో మ్యాచ్‌లో ఓడిపోయింది.




Advertisement

Next Story

Most Viewed