డెవిడ్ కాన్వే హాఫ్ సెంచరీ..తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-17 09:43:01.0  )
డెవిడ్ కాన్వే హాఫ్ సెంచరీ..తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్
X

దిశ, వెబ్ డెస్క్ : న్యూజిలాండ్ పేసర్ల ధాటికి టీమిండియా బ్యాటర్లు కుప్పకూలిన పిచ్ పైనే కివీస్ ఓపెనర్లు రాణించారు. ఓపెనర్ డెవిడ్ కాన్వే 54బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సిక్సర్ కొట్టి మరి తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 17ఓవర్లలో ఆ జట్టు 67పరుగులు సాధించగా, 18ఓవర్ తొలి బంతికి కుల్ధీప్ యాదవ్ మరో ఓపెనర్ టామ్ లాథమ్ ను అవుట్ చేసి టీమిండియాకు తొలి వికెట్ సాధించిపెట్టాడు. టీ విరామ సమయానికి కివీస్ వికెట్ నష్టానికి 82పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 36పరుగుల ఆధిక్యత సాధించింది. కాన్వే 61పరుగులతో, యంగ్ 5పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. కాగా కివీస్ ఫాస్ట్ బౌలర్లు ముగ్గురు మ్యాట్ హెన్రీ, విలియం ఓ రూర్కీ, ,సౌథీలు చెలరేగిన పిచ్ పై టీమిండియా ఫాస్ట్ బౌలర్లు బూమ్రా, సిరాజ్ లు 11ఓవర్లు వేసినా వికెట్ సాధించలేకపోయారు. మూడో పేసర్ లేకపోవడంతో అశ్విన్, జడేజా, కుల్ధీప్ లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 31,2ఓవర్లలో 46పరుగుల స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయ్యింది.

Advertisement

Next Story