ఆర్టీసీకి కాసుల వర్షం

by Sridhar Babu |   ( Updated:2024-10-17 13:58:13.0  )
ఆర్టీసీకి కాసుల వర్షం
X

దిశ, ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు దసరా పండుగ కాసుల వర్షం కురిపించింది. ఖమ్మం రీజియన్ పరిధిలోని 7 డిపోల నుంచి ఈనెల 1వ తేదీ నుంచి 16 తేదీ వరకు హైదరాబాద్ నుంచి ఖమ్మం రీజియన్, ఖమ్మం రీజియన్ నుంచి హైదరాబాద్ కు 1210 బస్సులను అందుబాటులో ఉంచి ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చారు.

ఖమ్మం రీజియన్ మేనేజర్ సరిరామ్ నేతృత్వంలో ఆరు డిపోల సారథ్యంలోని 32.9 లక్షల ప్రయాణికులను వారి ప్రాంతాలకు చేర్చారు. 16 రోజుల పాటు ఖమ్మం రీజియన్ కు రూ. 25.5 కోట్ల ఆదాయాన్ని సమకూర్చారు. 7 డిపోల పరిధిలో ప్రతి ఒక్క ఉద్యోగి సమిష్టిగా పనిచేయడంతో ఇంత ఆదాయం వచ్చిందని చెప్పారు. దసరా సెలవుల్లో ఆర్టీసీ ఉద్యోగులు క్రమశిక్షణ గా ప్రయాణికుల ఆదరణ పొందారని తెలిపారు. దసరా సెలవుల్లో పని చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో ఇలానే సమిష్టిగా పని చేసి ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.

Advertisement

Next Story