దూకుడు పెంచిన హైడ్రా.. మరో కీలక నిర్ణయం

by Gantepaka Srikanth |
దూకుడు పెంచిన హైడ్రా.. మరో కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌(Hyderabad)లో ట్రాఫిక్ సమస్యపై హైడ్రా(Hydraa) అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ విభాగంతో కలిసి పనిచేయాలని హైడ్రా నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే డీఆర్ఎఫ్ బృందాలకు ట్రాఫిక్ నియంత్రణపై శిక్షణ ఇవ్వనున్నది. నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. హైడ్రాకు ఇటీవల ప్రభుత్వం మరిన్ని అధికారాలు కట్టబెట్టింది.

ఇక నుంచి జీహెచ్ఎంసీ ఆస్తులను కూడా పరిరక్షించనుంది. జీహెచ్ఎంసీకి చెందిన రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ బాడీలు, బహిరంగ ప్రదేశాలు, పబ్లిక్ పార్కులు మొదలైన పబ్లిక్ ఆస్తులు ఆక్రమణలకు గురికాకుండా రక్షించడానికి హైడ్రాకి అధికారాలు దక్కాయి. జీహెచ్ఎంసీతో పాటు ఓఆర్‌ఆర్‌ వరకూ ఉన్న 27 పురపాలికల్లో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, విపత్తు నిర్వహణకు అవసరమైన అధికారాలను హైడ్రాకు కట్టబెట్టింది. ఈ మేరకు బుధవారం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్‌ ఉత్తర్వులు ఇచ్చారు.

Advertisement

Next Story