- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిహార్‌లో 25కు చేరిన మృతులు.. సీఎం నితీశ్ కుమార్ కీలక ఆదేశాలు
దిశ, నేషనల్ బ్యూరో : బిహార్ కల్తీ మద్యం కేసులో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వెళ్తోంది. ఇప్పటివరకు 25 మంది కల్తీ మద్యం తాగి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు గురువారం ధృవీకరించారు. బిహార్ రాష్ట్రంలోని సరన్ మరియు సివన్ జిల్లాల్లో ఈ కల్తీ మద్యం ఘటన వెలుగుచూసింది. ఇండస్ట్రీయల్ స్పిరిట్‌లో మిథైల్ అల్కహాల్ కలిపిన నకిలీ మద్యం సేవించడం ఈ ఘోరం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. పరిస్థితి విషమంగా ఉండటంతో పలువురు కల్తీ మద్యం బాధితులకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
ఈ క్రమంలోనే బిహార్ సీఎం నితీశ్ కుమార్ రాష్ట్ర డీజీపీ అలోక్ రాజ్, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ అధికారులతో హై లెవల్ మీటింగ్ నిర్వహించారు. ఈ ఘటనకు గల కారకులను కఠినంగా శిక్షించాలని డీజీపీ అలోక్ రాజ్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. అదేవిధంగా, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఘటన జరిగిన రెండు జిల్లాల్లో పర్యటించి పరిస్థితిని పర్యవేక్షించాలని కోరారు. ఈ ఘటనపై సమగ్రంగా విచారణ జరిపేందుకు రెండు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బృందాల(సిట్)ను ఏర్పాటు చేస్తున్నట్లు బిహార్ ప్రభుత్వం పేర్కొంది. కాగా, కల్తీ మద్యం కేసులో ఇప్పటికే 12 మంది నిందితులను అరెస్టు చేసినట్లు డీజీపీ తెలిపారు. ప్రస్తుతం 49 మంది ఈ ఘటనలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.