Naga Chaitanya: నాగచైతన్య ‘NC24’ సినిమా నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన మూవీ మేకర్స్.. హైప్ పెంచేస్తున్న ట్వీట్

by Hamsa |
Naga Chaitanya: నాగచైతన్య ‘NC24’ సినిమా నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన మూవీ మేకర్స్.. హైప్  పెంచేస్తున్న ట్వీట్
X

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) ‘కస్టడీ’ మూవీ భారీ డిజాస్టర్ కావడంతో ఏడాది పాటు సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. ఇక ఎలాగైనా తదుపరి చిత్రంతో హిట్ అందుకోవాలని చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇటీవల ‘తండేల్’ (Thandel)సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చైతు బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అదే ఫామ్‌లో వరుస చిత్రాలు ప్రకటిస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం నాగచైతన్య, కార్తీక్ దండు కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు మేకర్స్. ‘NC-24’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర బ్యానర్‌పై బీవీఎస్ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అయితే ఇందులో మీనాక్షి చౌదరి(Meenakshi Chowdhury) హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. తాజాగా, చిత్రబృదం ‘NC-24’ సినిమాకు సంబంధించిన బిగ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీ సెట్స్ మీదకి వెళ్ళింది. ఇక ఇందుకు సంబంధించిన స్పెషల్ వీడియోను షేర్ చేసి అభిమానులను షాక్‌కు గురి చేశారు. చైతు ఎలా మేకోవర్ చేసుకున్నాడు. మైథలాజికల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమా కోసం అడవుల్లో పలు రహాస్యాలను చేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వీడియోను షేర్ చేస్తూ సీక్రెట్స్ బయటపెట్టబోతున్నాం.. ఎప్పుడూ చూడని విధంగా ఉండబోతోంది అనే క్యాప్షన్ జత చేసి హైప్ పెంచారు. ఇక ఈ వీడియో చూసిన ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఈ స్టోరీ ఏంటో తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.





Next Story