లైంగిక దాడి కేసులో శ్రీ‌లంక క్రికెట‌ర్‌కు ఊర‌ట‌..

by Vinod kumar |   ( Updated:2023-05-18 16:45:38.0  )
లైంగిక దాడి కేసులో శ్రీ‌లంక క్రికెట‌ర్‌కు ఊర‌ట‌..
X

సిడ్నీ: శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలకకు గురువారం ఊరట లభించింది. ఆస్ట్రేలియాలో కొనసాగుతున్న నాలుగు లైంగిక వేధింపుల ఆరోపణల్లో మూడింటిని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉపసంహరించుకున్నారు. 32 ఏళ్ల గుణతిలక టీ20 వరల్డ్ కప్ టోర్నీ కోసం శ్రీలంక జట్టుతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు గతేడాది నవంబర్‌లో అరెస్టయ్యాడు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. కానీ లీగల్ ప్రాసెస్ కోసం అతను ఆస్ట్రేలియాలోనే ఉండాల్సి వచ్చింది. చార్జ్ సర్టిఫికేషన్ కోసం ఆరు నెలల సమయం తీసుకున్నారు.

ఈ ఆలస్యాన్ని గుణతిలక తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. విదేశీ పైరుడిగా తన క్లయింట్ అనవసరమైన కష్టాలకు గురవుతున్నాడని వాదించారు. కేసు వాయిదాను కోరారు. దీంతో జూలై 13న ఈ క్రికెటర్ తిరిగి కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. డేటింగ్ యాప్ ద్వారా గుణతిలకకు ఓ మహిళ పరిచయమైంది. వీరిద్దరు సిడ్నీ బార్‌లో కలుసుకుని ఆ మహిళ ఇంటికి వెళ్లారు. అక్కడ గుణతిలక ఆ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు పోలీసులు తమ ఫ్యాక్ట్స్ షీట్‌లో పేర్కొన్నారు. అరెస్టయిన గుణతిలకను శ్రీలంక క్రికెట్ బోర్డు సస్పెండ్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed