- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెన్నై సూపర్ కింగ్స్‌కి షాక్.. ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి ఫాస్ట్ బౌలర్ ఔట్
by Vinod kumar |
X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మార్చి 31 నుంచి ఐపీఎల్ 2023 సీజన్ మ్యాచ్‌లు ప్రారంభంకానుండగా.. జట్టు స్టార్ బౌలర్ న్యూజిలాండ్‌కి చెందిన కైల్ జెమీషన్ గాయంతో టోర్నీ మొత్తానికీ దూరమయ్యాడు. ఐపీఎల్ 2023లో చెన్నై జట్టుకి కీలకంగా మారుతాడని అంతా ఊహించారు. గత కొంతకాలంగా వెన్ను గాయం తో ఇబ్బంది పడుతున్న ఈ ఫాస్ట్ బౌలర్.. త్వరలోనే సర్జరీ చేయించుకోబోతున్నాడు. దాంతో దాదాపు 9 నెలల పాటు క్రికెట్‌కి అతను దూరంగా ఉండాల్సి వస్తుంది.
2021లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కైల్ జెమీషన్ ఇప్పటి వరకూ 9 మ్యాచ్‌లు ఆడగా.. ఐపీఎల్ 2023 సీజన్ ఆటగాళ్ల వేలంలో రూ.1 కోటికి చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. బౌలింగ్‌లోనే కాదు.. బ్యాటింగ్‌లో కూడా జెమీషన్ జట్టుకి ఉపయోగపడగలడు. బంతిని జెమీషన్ చాలా బలంగా హిట్ చేస్తుంటాడు.
Advertisement
Next Story