క్రికెటర్ హైదరాబాద్ మాజీ ఓపెనర్ అజీమ్ కన్నుమూత

by samatah |   ( Updated:2023-04-19 03:52:05.0  )
క్రికెటర్ హైదరాబాద్ మాజీ ఓపెనర్ అజీమ్ కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్ : హోరా హోరిగా ఐపీఎల్ నడుస్తున్న సమయంలో క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ అందింది. దేశవాళీ క్రికెట్‌లో దూకుడైన ఓపెనర్‌గా పేరొందిన హైదరాబాద్ మాజీ క్రికెటర్ అబ్దుల్ అజీమ్ (62) మంగళవారం కన్నుమూశారు. గత కొన్ని రోజులతో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన నిన్న తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇక 1980-95 మధ్య అజీమమ్ 73 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి,4644 రన్స్ చేశాడు. ఇందులో 12 సెంచరీలు,18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 1986లో తమిళనాడుపై ట్రిపుల్ సెంచరీ చేశారు. రిటైర్మెంట్ తర్వాత హైదరాబాద్ జట్టు చీఫ్ కోచ్, సెలక్టర్‌గా పని చేశారు. మచి స్నేహితుడిని కోల్పోయానని సీపీ సీవీ ఆనంద్ ట్వీట్ చేశారు.

👉 Dishadaily Web Stories

Advertisement

Next Story