- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ వార్తల్లో నిజం లేదు : సోషల్ మీడియా సంపాదనపై కోహ్లీ రియాక్ట్
న్యూఢిల్లీ : టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో పోస్టుకు రూ. 11.45 కోట్లు సంపాదిస్తాడనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శనివారం ట్విటర్ వేదికగా ఆ వార్తలపై కోహ్లీ స్పందించాడు. ఆ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశాడు. ‘నా జీవితంలో నేను పొందిన ప్రతిదానికి రుణపడి ఉంటాను. ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. నా సోషల్ మీడియా సంపాదనపై వస్తున్న వార్తలు నిజం కాదు.’ అని కోహ్లీ ట్వీట్ చేశాడు. కాగా, ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీకి 25.6 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ షెడ్యూలింగ్ టూల్ హోపర్ హెచ్‌క్యూ అనే సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా ఆర్జించే వారి జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో 14వ స్థానంలో ఉన్న కోహ్లీ.. ఒక్కో పోస్టుకు రూ. 11.45 కోట్లు సంపాదిస్తాడని హోపర్ హెచ్‌క్యూ అంచనా వేసింది. దాంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.