'షెడ్యూల్ ఖరారు కాకముందే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి'.. మంత్రి కేటీఆర్‌కు కామెంటేటర్ వెంకటేష్ వినతి

by Vinod kumar |   ( Updated:2023-06-12 14:48:13.0  )
షెడ్యూల్ ఖరారు కాకముందే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.. మంత్రి కేటీఆర్‌కు కామెంటేటర్ వెంకటేష్ వినతి
X

దిశ, వెబ్‌డెస్క్: వన్డే వరల్డ్​ కప్​2023లోనూ పాక్​-భారత్​ సమరాన్ని హైదరాబాద్ క్రికెట్​​ప్రియులు మిస్ కానున్నట్లు తెలిస్తోంది. తెలుగు రాష్ట్రాల క్రికెట్‌ అభిమానులకు ఇది బ్యాడ్‌ న్యూస్‌. వన్డే ప్రపంచ కప్‌ కోసం బీసీసీఐ షార్ట్‌ లిస్ట్​చేసిన వేదికల లిస్ట్‌లో హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియం ఒక్కటి. అయితే ఉప్పల్‌లో మాత్రం టీమ్​ఇండియా ఆడే అవకాశాలు కనిపించడం లేదు. టీమ్​ఇండియా మ్యాచ్‌లకు సంబంధించి బీసీసీఐ సిద్ధం చేసిన డ్రాఫ్ట్​షెడ్యూల్‌లో హైదరాబాద్‌ పేరు లేనట్లు సమాచారం అందింది. వేరే జట్లకు సంబంధించిన లీగ్‌ మ్యాచ్‌లు ఈ మైదానంలో జరిగే అవకాశాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ హైదరాబాద్‌ ఉప్పల్ స్టేడియంలో ఇండియా మ్యాచ్‌ ఉండదని తెలిసి ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఇదే విషయంపై కామెంటేటర్ వెంకటేష్.. మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ వేదికగా ట్విట్ చేశారు. 'ఉప్పల్ వేదికగా ఇండియా మ్యాచ్ లేకపోవడం నిరాశ కలిగించే వార్త. స్టేడియం పునరుద్ధరిస్తున్నా ఇండియా మ్యాచ్‌లు లేవు. 2011 వన్డే వరల్డ్ కప్‌లోనూ ఈ విధంగానే జరిగింది. షెడ్యూల్ ఖరారు కాకముందే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి' అని మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తూ ట్విట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed