- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Esha Singh: పారిస్ ఒలింపిక్స్‌కు హైదరాబాదీ షూటర్.. సీఎం రేవంత్ అభినందనలు
దిశ, డైనమిక్ బ్యూరో: పారిస్ 2024 ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించడానికి సిద్ధంగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన ఔత్సాహిక షూటర్ ఈషా సింగ్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు. జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరగనున్న పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ఫ్రాన్స్ వెళ్లే ముందు.. ఆమె గురువారం సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రిని కలిశారు.
ఈ సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం, ఒలింపిక్ పతకాన్ని సాధించి దేశానికి కీర్తిని తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలోనే ఈషా సింగ్ కుటుంబ సభ్యులతో కలిసి సీఎంను కలిశారు. కాగా, 2023లో జరిగిన ఆసియా క్రీడల్లో ఈషా సింగ్ సత్తా చాటింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో బంగారు పతకం, 25, 10, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్‌లో వరసగా రజత పతకాలను సాధించింది. ఈ క్రమంలోనే ఆమె పారిస్ ఒలంపిక్స్‌కు ఎన్నిక అయింది.