పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కొత్త చైర్మన్.. పంజాబ్ ముఖ్యమంత్రికి పగ్గాలు

by Harish |
పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కొత్త చైర్మన్.. పంజాబ్ ముఖ్యమంత్రికి పగ్గాలు
X

దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) కొత్త చైర్మన్‌గా మొహ్సిన్ నఖ్వీ ఎన్నికయ్యాడు. మంగళవారం లాహోర్‌లో నిర్వహించిన బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మీటింగ్‌లో మొహ్సిన్ నఖ్వీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని పీసీబీ ఓ ప్రకటనలో తెలిపింది. పంజాబ్ ప్రావిన్స్‌కు మొహ్సిన్ నఖ్వీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 37వ పీసీబీ చైర్మన్‌గా ఎన్నికైన అతను.. ఆ పదవిలో మూడేళ్లపాటు కొనసాగుతాడు. దేశంలో క్రికెట్‌ స్థాయిని మెరుగుపర్చడానికి, పరిపాలనలో ప్రొఫెషనలిజం తీసుకరావడానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు.

కాగా, నాలుగేళ్లలో పీసీబీకి నియామకమైన నాలుగో చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ. 2021లో రమీర్ రాజా బాధ్యతలు చేపట్టగా 2022లో వైదొలిగారు. ఆ తర్వాత నమజ్ సేథీ, జక్రా అష్రఫ్ బోర్డును పర్యవేక్షించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed