- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అక్కాతమ్ముళ్లకు తొలి విజయం.. క్యాండిడేట్స్ చెస్‌లో పుంజుకున్న వైశాలి, ప్రజ్ఞానంద
దిశ, స్పోర్ట్స్ : కెనడాలో జరుగుతున్న క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్లు, అక్కాతమ్ముళ్లు ఆర్.వైశాలి, ఆర్.ప్రజ్ఞానంద పుంజుకున్నారు. తమ విభాగాల్లో మూడో రౌండ్‌లో తొలి విజయాన్ని పొందారు. తొలి రౌండ్‌లో డ్రా, రెండో రౌండ్‌లో ఓటమి పొందిన ప్రజ్ఞానంద మూడో రౌండ్‌లో సత్తాచాటాడు. సహచరుడు విదిత్ గుజరాతిపై నెగ్గాడు. తెల్లపావులతో ఆడిన అతను 45 ఎత్తుల్లో విదిత్‌పై పైచేయి సాధించాడు. అలాగే, మరో భారత క్రీడాకారుడు గుకేశ్ మూడో రౌండ్‌ను డ్రా చేసుకున్నాడు. రష్యా ప్లేయర్ ఇయాన్ నెపోమ్నియాచ్చితో 35 ఎత్తుల్లో డ్రాకు అంగీకరించాడు.
పురుషుల విభాగంలో గుకేశ్ 2.0తో అగ్రస్థానంలో ఉండగా.. విదిత్, ప్రజ్ఞానంద రెండో స్థానాన్ని పంచుకున్నారు. ఇక, ఉమెన్స్ విభాగంలో ఆర్.వైశాలి తొలి విజయాన్ని పొందింది. మూడో రౌండ్‌లో ఆమె బల్గేరియా క్రీడాకారిణి నూర్య్గుల్ సలిమోవాపై విజయం సాధించింది. ప్రత్యర్థి తప్పిదాలను సద్వినియోగం చేసుకున్న వైశాలి 33 ఎత్తుల్లో నెగ్గింది. భారత స్టార్ క్రీడాకారిణి కోనేరు హంపి వరుసగా మూడో డ్రా చేసుకుంది. మూడో రౌండ్‌లో చైనాకు చెందిన టాన్ ఝోంగితో కలిసి పాయింట్లు పంచుకుంది.