ఐపీఎల్‌లో CSK మరో రికార్డు.. తొలి జట్టుగా..

by Vinod kumar |   ( Updated:2023-08-20 15:44:36.0  )
ఐపీఎల్‌లో CSK మరో రికార్డు.. తొలి జట్టుగా..
X

న్యూఢిల్లీ : ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నయ్ సూపర్ కింగ్స్ మరో రికార్డు సాధించింది. భారత మాజీ దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనీ సారథ్యంలోని సీఎస్కే ఐదు ఐపీఎల్ టైటిల్స్‌తో మోస్ట్ సక్సెస్‌ఫుల్ జట్టుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా చెన్నయ్ జట్టు అఫీషియల్ ట్విటర్ అకౌంట్‌10 మిలియన్ ఫాలోవర్స్‌ను సంపాదించింది. ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో 10 మిలియన్ ఫాలోవర్స్‌ కలిగిన తొలి, ఏకైక జట్టుగా సీఎస్కే నిలిచింది. గురువారం ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేసిన ఫ్రాంచైజీ.. ఫాలోవర్స్‌‌కు కృతజ్ఞతలు తెలిపింది.

ఐదు టైటిల్స్ గెలిచిన మరో ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్.. చెన్నయ్‌ తర్వాతి స్థానంలో ఉన్నది. ముంబై జట్టుకు 8.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. మూడో స్థానంలో 6.8 మిలియన్ ఫాలోవర్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఉండగా.. కోల్‌కతా నైట్‌ రైడర్స్(5.2 మిలియన్), సన్‌రైజర్స్ హైదరాబాద్(3.2 మిలియన్) వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాతి స్థానాల్లో పంజాబ్ కింగ్స్(2.9 మిలియన్), రాజస్థాన్ రాయల్స్(2.7 మిలియన్), ఢిల్లీ క్యాపిటల్స్(2.5 మిలియన్), లక్నో సూపర్ జెయింట్స్(7.6 లక్షలు), గుజరాత్ టైటాన్స్(5.2 లక్షలు) జట్లు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed