- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టు ప్రకటన.. అరివీర భయంకరంగా ఆసిస్ జట్టు

దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy)కి మరో నెల రోజుల్లో తెర లేవనుంది. ఈ క్రమంలోనే టోర్నీ కోసం అన్ని బోర్డులు తమ జట్లను ప్రకటిస్తున్నారు. తాజాగా, క్రికెట్ ఆస్ట్రేలియా (Cricket Australia) ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy)కి జట్టును వెల్లడించింది. గాయం కారణంగా శ్రీలంక టూర్ (Srilanka Tour)కు దూరంగా ఉన్న కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) మెగా టోర్నీకి ఆస్ట్రేలియా (Australia) కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అదేవిధంగా సీనియర్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ (Steve Smith)కు జట్టులో స్థానం దక్కింది.
అదేవిధంగా టీ20 స్పెషలిస్ట్ డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ (Travis Head), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (Maxwell), మిచెల్ మార్ష్ (Mitchell Marsh), మిచెల్ స్టార్క్ (Mitchell Starc)లకు టీమ్‌లో స్థానం సంపాదించారు. ఇటీవలే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy) సందర్భంగా గాయపడిన జోష్ హేజిల్‌వుడ్ (Josh Hazlewood) తిరిగి జట్టులోకి రావడంతో ఆ జట్టు బౌలింగ్ విభాగం బలపడింది. జట్టు కూర్పు చూస్తే బ్యాటింగ్ బౌలింగ్ పరంగా అరవీర భయంకరంగా కనిపిస్తోంది. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy)లో ఆసిస్ జట్టు సత్తా చాటి కప్‌ను కైవసం చేసుకుటుందా.. లేక ఆరంభ మ్యాచ్‌లలోనే బోల్తా ఇంటికెళ్తుందా తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.
ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్.